పదవి నుంచి తప్పుకుంటానంటున్న ఏపీ మంత్రి

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇసుక విషయంలో తాను అవినీతికి పాల్పడినట్టు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించడంపై ఆయన పై విధంగా స్పందించారు.

 Ap Minister Dharmana Krisna Dass Chalenges To Tdp Leaders-TeluguStop.com

శ్రీకాకుళం జిల్లాలోని కల్లేపల్లి లో ఇసుక వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టుగా తనపై అవినీతి వ్యాఖ్యలు చేస్తున్నారని, టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల తో రాష్ట్ర వ్యాప్తంగా దోచుకున్నారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పేదలకు మేలు చేస్తుంటే చూడలేక ఇలా నాయకులపై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు.

ఇటీవల తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన చార్జ్ షీట్ లో 13 జిల్లాల్లో 67 మంది వైసిపి నాయకులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపణలు చేసింది.

ఆ లిస్టులో తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా, పార్థసారధి, సామినేని ఉదయభాను, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్ర ప్రసాద్, పెద్దిరెడ్డి తదితరులతో పాటు తన పేరు కూడా ఆ జాబితాలో చేర్చడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube