మళ్లీ మూడు రాజధానుల బిల్లు ! ఎప్పుడో చెప్పిన మంత్రి 

Ap Minister Balineni Srinivasareddy Sensational Comments On Ap Capital Issue

ఈ మధ్యనే మూడు రాజధానులబిల్లును రద్దు చేస్తున్నట్లు స్వయంగా ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ లో ప్రకటన చేశారు.దీంతో అమరావతి మళ్లీ రాజధాని అవుతుందని అందరూ భావించారు.

 Ap Minister Balineni Srinivasareddy Sensational Comments On Ap Capital Issue-TeluguStop.com

అంతే కాదు, జగన్ ప్రకటనపై మాట తప్పడు మడమ తిప్పడు అంటూ సెటైర్లు పడ్డాయి.  అయితే ఇదంతా కోర్టు ఇబ్బందులు ఉండటం కొన్ని సమస్యలు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే మూడు రాజధానులబిల్లు ను మరింత పవర్ ఫుల్ గా ప్రవేశపెడతాం అంటూ వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడటంతో అంత సందిగ్ధంలో పడిపోయారు.

  బిల్లును రద్దు చేసినట్టు చేసిన ప్రకటన తరువాత  మళ్ళీ కొత్త బిల్లును జగన్ ప్రవేశపెట్టడం వెనుక రాజకీయం ఏంటి అనే చర్చ అందరి మధ్య సాగింది.

 Ap Minister Balineni Srinivasareddy Sensational Comments On Ap Capital Issue-మళ్లీ మూడు రాజధానుల బిల్లు ఎప్పుడో చెప్పిన మంత్రి -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే అమరావతిని రాజధానిగా ఉంచాలని, మూడు రాజధానుల నిర్ణయం రద్దు చేసుకోవాలని కోరుతూ అమరావతి ప్రాంత మహిళలు రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే .న్యాయ స్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర సైతం నిర్వహిస్తున్నారు.కొత్త బిల్లు జగన్ ప్రవేశపెడతామని ప్రకటించినా , అప్పట్లో అది సాధ్యమయ్యే పనికాదని అంత పెదవి విరిచారు అయితే జగన్ మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.

  తాజాగా ఈ అంశంపై జగన్ బంధువు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.  మళ్లీ మూడు రాజధానులబిల్లు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని క్లారిటీ గా చెప్పారు.

దీంతో కొత్త బిల్లులో ఏ ఏ అంశాలు జగన్ అదనంగా చేర్చారు ? ఏ విధంగా కొత్త రాజధాని బిల్లు ఉండబోతోంది అనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో మొదలైంది.

వైసీపీ  ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి అమరావతి రాజధానిగా ఒప్పుకునేది లేదు అంటూ ఎన్నో ఆందోళనలు నిర్వహించింది.  అయినా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో పాటు,  అక్కడ తాత్కాలిక భవనాలు నిర్మించడం,  పరిపాలన అమరావతి నుంచే కొనసాగించడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అమరావతి ని పక్కన పెట్టి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి ముందుకు వెళ్తున్న తరుణంలోనే ఆకస్మాత్తుగా వరుసగా వైసీపీ ప్రభుత్వం నుంచి ఈ కీలక నిర్ణయాలు వెలువడుతూ వస్తున్నాయి.

#Amaravati #AP #Ysrcp #Jagan #Asembly

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube