ఫోర్జరీ అయిన మంత్రి సంతకం,కారకులు ఎవరంటే  

Ap Minister Balineni Srinivasa Reddy Letterhead Forged By Constable-

అవినీతి రహిత పాలన కొనసాగించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాన నినాదం అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన తీసుకొనే ప్రతి చర్య కూడా అవినీతి రహితంగా ఉండాలి అంటూ మంత్రులకు కూడా సూచించారు.

Ap Minister Balineni Srinivasa Reddy Letterhead Forged By Constable--AP Minister Balineni Srinivasa Reddy Letterhead Forged By Constable-

అయితే అవినీతి రహిత పాలన అని నినదిస్తున్న జగన్ సర్కార్ లోని ఒక మంత్రి సంతకం ఫోర్జరీ కి గురైనట్లు తెలుస్తుంది.అయితే మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రమేయం లేకుండా ఆయన కార్యాలయంలోని కీలక వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది.

Ap Minister Balineni Srinivasa Reddy Letterhead Forged By Constable--AP Minister Balineni Srinivasa Reddy Letterhead Forged By Constable-

ఆయన తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా కలిసి మంత్రి గారి లెటర్ హెడ్ మీద సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ విషయం తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది.ఈ ఘటనకు సంబంధం ఉందనే అనుమానంతో కానిస్టేబుల్స్ వెంకటేశ్వర రెడ్డి, వేణుగోపాల్ ని జిల్లా ఎస్పీ వీఆర్‌కి పంపించి వన్ టౌన్ సీఐ భీమా నాయక్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు.

అయితే ప్రస్తుతం పోలీసు విచారణలో దీనికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మంత్రి వ్యక్తిగత కార్యాలయ సిబ్బంది, కానిస్టేబుల్స్ కీలకపాత్ర పోషించినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.కొత్త ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారీ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత స్థాయి పోస్టులలో చేరడానికి, తాము ఉన్న స్థానంలోనే కొనసాగడానికి మంత్రులు, ఎమ్మెల్యేలను ఆశ్రయించడం సహజం.

ఈ నేపథ్యంలోనే మంత్రి బాలినేని కి ఎలాంటి సమాచారం లేకుండా ఆయన లెటర్ హెడ్ పై సంతకం ఫోర్జరీ చేసి వారికి సిఫార్సులు చేసినట్లు తెలుస్తుంది.దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.