ఏపీ మంత్రి గారి పేషీ లో కరోనా కలకలం, అటెండర్ కు కరోనా పాజిటివ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని గారి ఆఫీస్ లో కరోనా కలకలం మొదలైంది.ఆయన పేషీలో పనిచేసే అటెండర్‌కు క‌రోనా పాజిటివ్‌ తేలడం సంచలనం రేగింది.

 Ap Minister Alla Nani Attender Positive-TeluguStop.com

మంగళవారం నిర్వహించిన ట్రూనాట్‌ పరీక్షలో ప్రిజంప్టివ్‌ పాజిటివ్ అని‌ తేలడం తో తుది నిర్ధారణ కోసం నమూనాను వైరాలజీ ల్యాబ్‌కి పంపినట్లు తెలుస్తుంది.మరోపక్క పాజిటివ్ తేలిన అటెండర్‌ను కూడా పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు తరలించినట్లు సమాచారం.

ఏపీ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
ఈ రోజు కూడా తాజాగా మరో 73 కరోనా పాజిటివ్ కేసులు తేలడం తో రాష్ట్ర వ్యాప్తంగా 1300 లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఈ క్రమంలోనే ఎవరైనా అనారోగ్యం బారిన పడగానే వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 Ap Minister Alla Nani Attender Positive-ఏపీ మంత్రి గారి పేషీ లో కరోనా కలకలం, అటెండర్ కు కరోనా పాజిటివ్-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనారోగ్యంతో బాధపడుతున్న అటెండర్ కు కూడా వైద్య సిబ్బంది మంగళవారం ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో ప్రిజంప్టివ్‌ పాజిటివ్‌ అని రావడం తో తుది నిర్ధారణకు నమూనాను వైరాలజీ ల్యాబ్‌కి పంపారు.

ఆయన ఇటీవల ఎవరిని కలిశారు.వ్యాధి ఎలా సోకిందనే కోణంలో విచారణ ప్రారంభించినట్లు తెలుస్తుంది.

అతనికి సన్నిహితంగగా ఉన్నవారిని గుర్తించేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు మంత్రి భద్రత సిబ్బంది, పేషీలోని మిగతా అధికారులు, ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.ఏపీరాజ్ భవన్ లో కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా మంత్రిగారి పేషీ లో కూడా కరోనా పాజిటివ్ రావడం తో అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.

#Alla Nani #Corona Positive #AP Minister

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు