ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తాజా కరోనా బులెటిన్‌.. !  

ap medical and health department latest corona bulletin, ap, corona virus, update, today, covid 19, ap medical and health department, corona bulletin - Telugu Ap, Ap Medical And Health Department, Corona Bulletin, Corona Virus, Covid-19, Today, Update

దేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ వింజృంభిస్తుండటంతో మిగతా రాష్ట్రల్లోని వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లో ఆందోళన మొదలైందట.

TeluguStop.com - Ap Medical Health Department Latest Corona

మరోసారి కోవిడ్ 19 వ్యాపిస్తే తట్టుకుని నిలబడే పరిస్దితులు దేశంలో లేవు.

అటూ ప్రభుత్వాలు కూడా విఫలం అవడం ఖాయం అనే గుసగుసలు వినిపిస్తున్నాయట.ఇదిలా ఉండగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ విడుదల చేసింది.

TeluguStop.com - ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తాజా కరోనా బులెటిన్‌.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

వారు వెల్లడించిన వివరాల ప్రకారం.

ఆంధ్రప్రదేశ్ లో‌ కరోనా పాజిటివ్ కేసులు కొన్ని రోజులుగా 100 కు దిగువగానే వస్తున్నాయట.

ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18,257 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వాటిలో కొత్త పాజిటివ్‌ కేసులు 41 వరకు నమోదు అయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడిస్తుంది.

ఇకపోతే గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని, కరోనా నుండి 71 మంది రికవరీ అయ్యారని తెలియచేసింది.ఇక ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 886444 కి చేరగా, కోలుకున్న వారి సంఖ్య 878687 కి చేరుకుందట.కాగా కరోనాతో ప్రస్తుత సమాచారం వరకు 7167 మంది మృతి చెందగా, రాష్ట్రంలో 590 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఈ బులెటిన్‌లో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

#Corona Virus #Today #COVID-19 #ApMedical #Update

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు