పవన్ రాజకీయంతో బీజేపీకి ముచ్చెమటలే ?

ఎందుకో తెలియదు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బిజెపి చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టుగానే కనిపిస్తోంది.అసలు ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకున్నాము అనే విషయాన్ని కూడా మరిచిపోయి మరీ బిజెపి వ్యవహరిస్తున్న తీరు కొంతకాలంగా పవన్ తో పాటు, జనసైనికులు అందరికీ ఆగ్రహం కలిగిస్తోంది.

 Jansena Chief Pavan Kalyan Key Desistion On Bjp, Ap, Janasena, Pawan Kalyan, Bjp-TeluguStop.com

వాస్తవంగా జనసేనకు కోట్లాది మంది అభిమానులు, ఒక సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయి.రాజకీయ ఎత్తులు వేయడం, వ్యూహాలు రచించడంలో అనుభవం లేకపోవడం, వాస్తవ పరిస్థితులను గుర్తించడంలో వెనుకపడడం వంటి కారణాలతో 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని జనసేన చవిచూడాల్సి వచ్చింది.

ఆ తర్వాత బిజెపి స్వయంగా పవన్ కు కబురు పంపించి మరీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది.

మొదట్లో జనసేన తో సఖ్యతగానే వ్యవహరించిన బిజెపి, ప్రస్తుతం జనసేనను పట్టించుకోనట్టు గానే ముందుకు వెళ్తోంది.

ఏపీ విషయంలో ఉమ్మడిగా రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా, మాట వరసకైనా తమను సంప్రదించకుండా బిజెపి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ, తమను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ వస్తుండడంపై పవన్ ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్నారు.మొన్నటి వరకూ బిజెపి ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పవన్ తో సక్యతగానే ఉంటూ వచ్చారు.

అమరావతి విషయంలో జనసేన బీజేపీ కలిసి ఉమ్మడిగా ఆందోళన నిర్వహించింది.కానీ ఆ తర్వాత బిజెపి తన వైఖరి మార్చుకుని, అమరావతి వ్యవహారంలో తాము కలుగజేసుకోము అంటూ ప్రకటన చేసింది.

అంతేకాదు ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం ఇష్టం అంటూ ప్రకటించి పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది.

Telugu Amaravathi, Ap, Janasena, Janasenabjp, Pawan Kalyan, Sommu Verraju-Telugu

ఈ వ్యవహారం పవన్ కు మరింత ఆగ్రహాన్ని కలిగించింది.గతంలో బిజెపి జనసేన ఉద్యమం చేపట్టిన సమయంలో, బిజెపి సహకారంతో రాజధాని అక్కడే ఉంటుందని , ఎక్కడికీ వెళ్లదని రైతులు, ప్రజలకు హామీ ఇచ్చారు.కానీ ప్రస్తుతం బిజెపి ఈ విధంగా తమ అభిప్రాయం చెప్పడంతో, ఇప్పుడు జనసేన ఆగ్రహానికి కారణం అవుతోంది.

తమను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్న బిజెపిని అంతే స్థాయిలో దెబ్బకొట్టాలని పవన్ ఆలోచిస్తున్నారు.అందుకే బిజెపి వైఖరికి భిన్నంగా అమరావతికి మద్దతు ప్రకటించడంతో పాటు, హైకోర్టులో ఈ మేరకు కౌంటర్ కూడా దాఖలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

దీంతో బీజేపీ జనసేన పొత్తు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

Telugu Amaravathi, Ap, Janasena, Janasenabjp, Pawan Kalyan, Sommu Verraju-Telugu

వాస్తవంగా ఏపీలో పవన్ కు రాజకీయంగా బలం లేకపోయినా, కావలసినంత బలగం ఉంది.దానిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఏపీలో బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడడం పెద్ద కష్టమేమి కాదు.కానీ ఆ విషయాన్ని పట్టించుకోని బిజెపి స్వతంత్రంగానే వ్యవహరించాలని చూస్తోంది.

దీనికితోడు కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు దూకుడుగానే వ్యవహరిస్తూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న తీరు జనసేన నాయకులకు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube