పోలవరంకు మళ్లీ భూమిపూజ

ఏపీ గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, అవినీతి జరగడంతో వ్యయం బాగా పెరిగింది అంటూ ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్‌ చెప్పుకొచ్చారు.ఏపీలో జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పోలవరంకు రివర్స్‌ టెండరింగ్‌ను చేయడం జరిగింది.

 Ap Irrigation Minister Anil Kumar Yadav Re Start The Polavaram Work-TeluguStop.com

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో మేఘ సంస్థ మాత్రమే టెండర్‌ వేయడంతో మరే సంస్థ కూడా పోటీ పడక పోవడంతో ఆ సంస్థకే టెండర్‌ దక్కింది.కాలేశ్వరం కట్టిన మేఘ సంస్థ పోలవరంను త్వరలోనే పూర్తి చేస్తామంటూ ప్రకటించారు.

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ అంటూ మేఘ సంస్థకు ఇవ్వడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లడం జరిగింది.దాంతో కోర్టులో ఉన్న కారణంగా వెంటనే పోలవరం పనులు ఆపేయాలని, రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో విచారణ జరపాలంటూ కోర్టు సూచించింది.

సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు ఎట్టకేలకు స్టేను ఎత్తి వేసింది.పోలవరం పనులు మళ్లీ ప్రారంభించవచ్చు అంటూ సూచించింది.దాంతో నేడు మంత్రి అనీల్‌ కుమార్‌ భూమి పూజ చేసి మరీ మళ్లీ పోలవరం పనులను పున: ప్రారంభించారు.పోలవరం ప్రాజెక్ట్‌ను మరో రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామంటూ మేఘ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube