తెలంగాణాలో దొరికిపోయిన ఏపీ కానిస్టేబుళ్లు !     2018-10-27   11:51:37  IST  Sai Mallula

జర్నలిస్టులమంటూ చెప్పుకుంటూ ప్రజలను, ఆలయానికి వచ్చే భక్తులను ప్రశ్నిస్తున్న కొంతమంది వ్యక్తులపై అనుమానం వచ్చిన స్ధానికులు వారిని పట్టుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, తాము ఏపీకి చెందిన ఐడీ కానిస్టేబుల్స్ మని తెలిపారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఈ వ్యవహారం కలకలం రేగింది.

Ap Intligence Police Secret Sarve At Telangana-

Ap Intligence Police Secret Sarve At Telangana

ఏపీ నుంచి ఐడీ పార్టీ కానిస్టేబుల్స్ ను తెలంగాణలో సర్వే కోసం ఎల్ రమణ ఈనెల 25న రప్పించారని తెలుస్తుంది. స్థానిక టీడీపీ నాయకులు ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను ధర్మపురి దేవస్థానంలో ఉంచి సర్వే చేయిస్తున్నారని తేలింది. ఆంధ్రప్రదేశ్‌ లో ఉద్యోగాలు చేసుకునే వారికి ధర్మపురిలో ఏంపని అంటూ స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.