రేపు ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు రిలీజ్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదల తేదీ ప్రకటించారు.జులై 23 వ తారీఖు అనగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

 Ap Inter Second Year Exam Results Release-TeluguStop.com

విడుదల చేసిన ఫలితాలు examresults.ap.ac.in, bie.ap.gov.in, results.bie.ap.gov.in, results.apcfss.in అనే వెబ్ సైట్ లో ఉంటాయని.మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని మే 5వ తారీకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.

ఇదే క్రమంలో ఇంటర్ విద్యా మండలి షెడ్యూలు కూడా రిలీజ్ చేయడం జరిగింది.

 Ap Inter Second Year Exam Results Release-రేపు ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు రిలీజ్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అటువంటి సమయంలో కరోనా కేసులు రాష్ట్రంలో పెరుగుతూ ఉండటంతో.పరీక్షలను వాయిదా వేయడం జరిగింది.

ఈ క్రమంలో జూలై మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించగా.ఆ సమయంలో కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.

కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో.  న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది.

విద్యార్థుల ప్రాణాలకు బాధ్యత ఎవరు వహిస్తారు అన్నరీతిలో ఆగ్రహం చెందటంతో ఏపీలో.టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

#Inter #AP Inter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు