విజయ సాయి పై ఏపీ ఇంటలిజెన్స్ నిఘా..అదిరిపోయే ట్విస్ట్   Ap Intelligence Attend Vijaya Sai Reddy Meetings     2018-04-04   01:15:04  IST  Bhanu C

ఏపీ ప్రతిపక్ష నేత జగన మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత పార్టీలో ఎంతో కీలకంగా ఉంటూ ఉన్న విజయసాయి రెడ్డి కి జగన్ కీలకమైన భాద్యతలు అప్పగించాడు..అప్పటి నుంచీ విజయసాయి రెడ్డి పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు..తెలుగుదేశం పార్టీ పై ఎప్పటికప్పుడు నిప్పులు చెరుగుతూ కొరకరాని కొయ్యగా మారుతున్న విజయసాయి రెడ్డి టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబే టార్గెట్ గా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఎకేస్తున్నారు..అసలు విజయసాయి నోరు మెదిపితే మాట్లాడేది చంద్రబాబు గురించి తప్ప మరే టాపిక్ ఉండటం లేదు..దాంతో అసలు విజయసాయి వ్యవహార శైలిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది ఈ విషయంపై వైసీపి వర్గాలలో తీవ్ర ఆందోళనలు కలిగించింది..ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తీరుపై పలువురు మండిపడుతున్నారు.

రాష్ట్రం విడిపోయిన సమయంలో స్పెషల్ స్టేటస్ విషయంలో తన గళం వినిపించిన వైసీపి కి తోడుగా ఇటీవలి కాలంలో మారిన పరిస్థితుల వల్ల అధికార టీడీపీ సైతం అదే పాట పాడుతోంది…అయితే టీడీపీ ప్రత్యేక పోరు వెనుక మర్మం ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి మీడియా ముందు ఏకి పడేస్తున్నారు..ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది.. ఈ ప్రచారాన్ని నిజం చేసేలా తాజాగా విజయసాయిరెడ్డి నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో ఇంటెలిజెన్స్ పోలీస్ ప్రత్యక్షమయ్యారు…అయితే ఎవరూ ఆవిషయాన్ని పట్టించుకోలేదు అందరూ మీడియా వ్యక్తి అనుకున్నారు..అయితే

విజయసాయి మీడియా సమావేశంలో తనని తానూ మీడియా సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకొని విజసాయి ఏమి చెప్పబోతున్నారో అనే విషయాలపై అక్కడి పరిస్థితులపై నిఘా ఉంచారు..అయితే ఇక్కడే ట్విస్ట్ ఏమిటంటే..సదరు నిఘా అధికారిని విజయసాయి గుర్తు పెట్టేశారు.. మీరు ఇంటెలిజెన్స్ అధికారి అని గుర్తుపట్టాను…ఇది కేవలం విలేఖరులకి సంభందించిన సమావేశం ఇక్కడ మీకు పని లేదు ఇక మీరు దయచేయండి అంటూ నెమ్మదిగా చెప్పేసరికి సదరు నిఘా అధికారి షాక్ అయ్యాడట…మీకు ఏమైనా సందేహాలుంటే నన్ను బయటకి వచ్చిన తరువాత నన్ను సంప్రదించండి..మీరు దయచేసిన వెళ్లిపోవచ్చు అని అన్నారట విజయసాయి..అయితే అప్పటికే ఎన్నో సార్లు విజయసాయి పై నిఘా నీడలు వెంటాడుతూ ఉన్నా సరే విజసాయి పెద్దగా పట్టించుకోలేదు అయితే ఈ పరిణామాలపై వైసీపి నేతలు ఫైర్ అవుతున్నారు..