జగన్ ఉచితాల వరదకు అడ్డుకట్ట పడకపోతే?

చేతికి ఎముకే లేదు అన్నట్లుగా ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వస్తూనే ఉన్నాయి.  ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలను ఆకట్టుకునేందుకు , వారికి ఆర్థిక  కష్టాలుుు తెలియకుండా చేసేందుకు , నిరుపేద ల కళ్ళలో ఆనందం చూసేందుకు … కారణం ఏదైనా ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అందరికీ ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు.

 Ap In Debt Due To Free Schemes Implemented By Jagan, Ap Cm Ys Jagan, Free Scheme-TeluguStop.com

అలాగే మరెంతో మందికి నేరుగా వారి బ్యాంకు అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తూ , ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి కలిగిన నాయకుడిగా పేరు పఖ్యాతులు సంపాదించుకున్నారు .అయితే జగన్ ఈ ఉచితాల వరద కొనసాగిస్తున్న తీీరు పై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.దేశవ్యాప్తంగా ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు చేయనటువంటి ఎన్నో ఉచిత పథకాలను జగన్ ప్రవేశపెట్టారుు.అయితే వీటిపై ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జగన్ ఈ ఉచితాల వరదకు అడ్డుకట్ట వేయకపోతే ఏపీ మరింత అప్పుల్లో కూరుకు పోతుందని వారు హెచ్చరిస్తున్నారు .
ఇదే విషయమై జాతీయ మీడియా సైతం ప్రత్యేక కథనాలు ఇస్తోంది .ఏపీ ఆర్థికంగా బలంగా లేకపోయినా , అప్పులు తెచ్చి మరి జగన్ ప్రజలకు పెడుతున్నారని , ఇదంతా రాబోయే రోజుల్లో ఏపీ కోలుకోలేని ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవడానికి కారణం అవుతుంది అనే కథనాలు ప్రచారం అయ్యాయి.ప్రస్తుతం కరోనా కష్ట సమయం నడుస్తుంది.

గతేడాది నుంచి సరిగ్గా పన్నుల వసూళ్లు తగ్గిపోయాయి.కేవలం ఏపీ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురైంది.

దీంతో రాష్ట్రలకు ఆర్థిక శాఖ బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకునేందుకు అవకాశం కల్పించింది.ఈ విధంగా తీసుకున్న రుణాలు తాలూకా వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు పంపించారు.

అయితే ఇందులో ఏపీకి సంబంధించి ఎక్కువగా ప్రజలకు ఉచిత పథకాల కోసం ఖర్చు  పెట్టినట్టుగా గా ఉండడం పై కేంద్రం ఆక్షేపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Telugu Ap Cm, Ap Financial, Ap, Cag, Central, Schemes, Jagan-Telugu Political Ne

ఎప్పటి నుంచో ఉచిత పథకాల ను కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది .అన్ని రాష్ట్రాలకు దీనిపై సూచనలు చేస్తోంది.ఉచిత పథకాలు సబ్సిడీలను క్రమక్రమంగా తగ్గించుకుంటూ రాష్ట్రాలను లోటు బడ్జెట్ నుంచి బయటపడాలని పదేపదే సూచిస్తోంది.

కానీ ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రం మాటను పట్టించుకోవడం లేదు.దీంతో రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి ఏపీకి ఆర్థిక సహకారం అందడం అనుమానంగానే కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube