ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు... హైకోర్టు ఆగ్రహం

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు ఆభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే, మొత్తం పరిపాలన నుంచి పంచాయితీల వరకు తన వైసీపీ బ్రాండ్ కనిపించేలా ఆ పార్టీ నేతలు చూసుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు సాదాసీదాగా కనిపించిన ప్రభుత్వ కార్యాలయాలకి సైతం వైసీపీ జెండా రంగులని వేసేస్తున్నారు.

 Ap High Court Unhappy With Ysrcp Party Colors For Government-TeluguStop.com

ఈ రంగుల వ్యవహారం ఎంత వరకు వచ్చిందంటే చివరికి జాతీయ జెండా మీద కూడా వైసీపీ రంగులు వేసేసెంత వరకు.అలాగే బడికి, గాందీ విగ్రహం దిమ్మలకి కూడా వైసీపీ పార్టీ రంగులని వేసేసారు.

ఇక ప్రభుత్వ పంచాయితీ కార్యాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎక్కడ చూసిన వైసీపీ రంగులే కనిపిస్తాయి.

ఈ వ్యవహారం మీద హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖ్యలైంది.దీనిని విచారణకి తీసుకున్న హైకోర్టు వైసీపీ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది.ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాలకి, స్కూల్స్ కి రంగులు వేయడం సరైన పద్ధతి కాదని చెప్పింది.

పది రోజులలో ఈ రంగుల వ్యవహారం మీద సమాధానం చెప్పాలని ఆదేశించింది.దీనిపై సమగ్రమైన సమాచారంతో నివేదిక ఇవ్వాలని చెప్పింది.

ఇంత కాలం విపక్షాలు వైసీపీ రంగుల వ్యవహారంపై విమర్శలు చేసిన పట్టించుకోని ప్రభుత్వం హైకోర్టుకి ఏం సమాధానం చెబుతుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube