కార్యాలయాల తరలింపు పై పిటీషన్,స్టే ఇచ్చిన కోర్టు

ఇటీవలే కర్నూలుకు పలు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.కర్నూలుకు పలు ప్రభుత్వ కార్యాలయాలను తరలించడంలో ఎలాంటి తప్పులేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా అన్నారు.

 Ap High Court Stays On Government Offices Shift To Kurnool-TeluguStop.com

అయితే ఇలా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం పై సోమవారం హైకోర్టు లో పిటీషన్ దాఖలు అయ్యింది.ఈ క్రమంలో ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 26 వరకు కార్యాలయాల తరలింపు పై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది.

విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు.జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్‌, సీఆర్డీఏను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు.

రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు.

అయితే పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా విజిలెన్స్ కార్యాలయాలను కర్నూలుకు ఎలా తరలిస్తారని కోర్టు ప్రశ్నించి,వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.మరోవైపు ఈ పిటిషన్లపై మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు.

మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా ఏపీ ప్రభుత్వం హడావిడిగా విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూల్ కు తరలిస్తూ శుక్రవారం అర్ధరాత్రి జీవో పాస్ చేసేసింది.అయితే దీనిని సవాల్ చేస్తూ హైకోర్టు మొత్తం మూడు పిటీషన్ లో దాఖలు అవ్వగా విచారణ చేపట్టిన హైకోర్టు పై మేరకు తీర్పు వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube