అమరావతి భూముల సిట్ ఏర్పాటుపై స్టే విధించిన ఏపీ హైకోర్టు !

అమరావతి భూముల అక్రమాలపై సిట్ ఏర్పాటు ప్రతిపాదనపై హైకోర్టు స్టే విధించింది.అమరావతి భూముల విషయంలో భారీ అక్రమాలు జరిగాయని జగన్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరింది.

 Ap, High Court, Stays, Amravati Land, Sit-TeluguStop.com

దీనిపై టీడీపీ నాయకులు వర్ల రామయ్య, ఆలపాటిరాజా సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.అయితే విచారణ చేపట్టిన హైకోర్టు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై తదుపరి చర్యలు లేకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పది మంది సభ్యులతో సీఎం జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది.టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలపై, మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాలపై ఈ సిట్ దర్యాప్తు చేసి కేసులు దాఖలు చేస్తుంది.

కేవలం అమరావతి భూములు అక్రమాలపై కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులపై, సీఆర్డీఏ పరిధిలో జరిగిన అవినీతి, ఇన్ సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీలు వంటి అంశాలపై దర్యాప్తు జరిపేందుకు జగన్ ప్రభుత్వం బాధ్యతలు ఇచ్చింది.దీనిపై సవాల్ విసిరిన టీడీపీ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు స్టే విధించడంతో జగన్ సర్కార్ ఒక్కసారిగా షాక్ కి గురైంది.అక్రమాలపై విచారణ జరిపేందుకు పర్మిషన్ ఇవ్వకుండా స్టే ఎలా విధిస్తారని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube