ఏపీ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్టు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా కరోనా కట్టడి చేయడం కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న విధివిధానాలను అదేవిధంగా కరోనా చికిత్స ఏ విధంగా రోగులకు అందుతుంది.? వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది వంటి వాటిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్ట్ ప్రభుత్వానికి.ఆదేశాలు జారీ చేసింది.

 Ap High Court Questions On Ap Government , High Court, Covid 19, Andhra Pradesh,-TeluguStop.com

అదేరీతిలో ఆక్సిజన్ కొరత లేకుండా నిల్వ ఉందా.? లేదా.? ప్రభుత్వం తెలపాలని పేర్కొంది.కరోనా రోగులకు సకాలంలో బెడ్లు అందుతున్నాయా లేదా అని కూడా ప్రశ్నించింది.

కరోనా చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్ పరిస్థితి ఏవిధంగా.ఉంది అన్నదానిపై ప్రశ్నించడం జరిగింది.

నిర్ధారణ పరీక్షలకి ఎంత టైం పడుతుంది అని హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది.ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమందికి వ్యాక్సిన్ వేయటం జరిగింది అన్న దానిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని తెలిపింది.

కేసును వచ్చే గురువారానికి వాయిదా వేశారు.  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube