పితాని సురేష్ కు హైకోర్టు లో చుక్కెదురు  

AP high court rejected Pitani Suresh\'s advance bail petition, AP high court, Pitani Suresh, ESI Scam, Pitani Satyanarayana, P S Murali Mohan, ACB Officers, - Telugu Acb Officers, Ap High Court, Esi Scam, P S Murali Mohan, Pitani Satyanarayana, Pitani Suresh

ఈ ఎస్ ఐ స్కాం కేసుకు సంబంధించి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట సురేష్ ముందస్తు బెయిల్ కోసం ఇటీవల ఏపీ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ పిటీషన్ విషయంలో సురేష్ కు చుక్కెదురైంది.

 Ap High Court Pitani Suresh Esi

ఏపీ హైకోర్టు ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేస్తూ నేడు తీర్పు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఈ ఎస్ ఐ స్కాం కు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది.

ఈ నేపథ్యంలో ఈ కుంభకోణం కు సంబంధించి ఇప్పటికే 11 మంది ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పితాని సత్యనారాయణ పీఎస్ మురళీమోహన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా పితాని సురేష్ ను అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారు.

పితాని సురేష్ కు హైకోర్టు లో చుక్కెదురు-Political-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో సురేష్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆ పిటీషన్ ను తిరస్కరించింది.ఈ ఎస్ ఐ కొనుగోళ్ల విషయంలో మాజీ మంత్రి పితాని పీఎస్ మురళీమోహన్,అలానే ఆయన కుమారుడు సురేష్ లు ఫార్మా కంపెనీ లతో చేతులు కలిపి ఈ కుంభకోణం కు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారయించారు.

ఈ క్రమంలో పితాని పీఎస్ ను అరెస్ట్ చేయగా,సురేష్ ను అదుపులోకి తీసుకొనే పనిలో అధికారులు ఉన్నారు.ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తంగా 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ కేసు కు సంబంధించి విచారణను ఏసీబీ అధికారులు మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తుంది.

#Pitani Suresh #AP High Court #ESI Scam #ACB Officers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap High Court Pitani Suresh Esi Related Telugu News,Photos/Pics,Images..