జగన్ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్ట్ !

చక చక నిర్ణయాలు తీసుకుంటూ ఏపీలో పరిపాలనను పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్ కు హైకోర్టు శుభవార్త చెప్పింది.ఖాళీగా ఉన్న సానిక సంస్థల పదవులు భర్తీ చేసే నిమిత్తం ఎన్నికలు జరపాలని జగన్ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.

 Ap High Court Permission Granted To Local Boady Elections-TeluguStop.com

జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే ప్రకటించింది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారించిన హైకోర్టు అప్పీల్ ను తిరస్కరించి తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

అలాగే ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.ఇక ఈ ఎన్నికల్లో బిసి, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్ కల్పించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube