అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు ఆపేయాలని హైకోర్టు తీర్పు..!!

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారానికి ఈరోజు లాస్ట్ రోజు కావడంతో ప్రధాన పార్టీల నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

 Ap High Court Orders To Stop Eluru Corporation Elections-TeluguStop.com

ఇలాంటి తరుణంలో హైకోర్టు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆపేయాలని తీర్పు ఇవ్వటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.మేటర్ లోకి వెళ్తే ఏలూరు పరిధిలో ఓటర్ల జాబితా అంశంలో దాఖలైన పిటిషన్ విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా కార్పొరేషన్ ఎన్నికలు ఆపేయాలని ఎస్ఈసీ ని ఆదేశించింది.

గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ లో బలవంతపు ఉపసంహరణలు బెదిరింపులు జరిగినట్లు జనసేన పార్టీ నాయకుడు శ్రీనివాసరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.పాటు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కోర్టును కోరారు.

 Ap High Court Orders To Stop Eluru Corporation Elections-అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు ఆపేయాలని హైకోర్టు తీర్పు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల విషయంలో కూడా ఇదే జరిగినట్లు.తెలపటంతో.

విచారణ జరిపి తీర్పును హైకోర్టు రిజర్వులో పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల గత ఏడాది నామినేషన్ల సమయంలో .బలవంతపు ఉపసంహరణలు జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఇలాంటి తరుణంలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల విషయంలో హైకోర్టు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆదేశాలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

#Zptc #Mptc #Janasena #High Court #West Godavari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు