మందుబాబులకు ఏపీ హైకోర్టు శుభవార్త.... ఇతర రాష్ట్రాల నుంచి కూడా...

ఏపీలో మందుబాబులకు ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు వారికి ఒక మంచి శుభవార్త తెలిపింది.కొంత కాలంగా ఏపీ లో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Ap High Court Green Signal To Liquor Transport From Other States, Ap, High Court-TeluguStop.com

తమకు కావాల్సిన బ్రాండ్లు కాకుండా ప్రభుత్వ బ్రాండ్లు మాత్రమే దొరుకుతుండడం తో మందుబాబులు పిచ్చెక్కిపోతూ ఇతర రాష్ట్రాల నుంచి మందు బాటిల్స్ ను తీసుకొచ్చుకోవడానికి సిద్ధమౌతున్నారు.ఈ క్రమంలో బోర్డర్ లో తనిఖీలు కూడా పెంచడం తో అదికూడా వీలుకుదరకపోవడం తో మందుబాబులు ఏమి చేయాలో అర్ధం కానీ పరిస్థితి.

ఇలాంటి సమయంలో ఏపీ హైకోర్టు వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తెచ్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

అయితే వారికి కావాల్సిన బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లను మూడుకు మించకుండా అనుమతి ఇచ్చింది.దీనికి సంబంధించిన జీవో నంబర్ 411వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారికి ఊరట కలిగించింది కోర్టు.ఏపీ లో గత కొంతకాలంగా మద్యం కు మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా లిక్కర్ తీసుకువచ్చుకుంటున్నారు.

ఈ క్రమంలోని కొందరైతే అక్రమంగా మద్యం తెచ్చి అమ్ముతూ దొరికి పోతున్నారు కూడా.

దానికి తోడు బార్డర్‌లో పోలీసులు తనిఖీలు పెంచడంతో ఒకటి రెండు బాటిళ్లు తెచ్చుకునే వారికి ఇబ్బందిగా మారింది.ఈ క్రమంలో ప్రయాణాల్లో 3 బాటిళ్ల లిక్కర్ ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి తీసుకురావచ్చని కోర్టు అభిప్రాయపడింది.

మరి కోర్టు తాజా ఉత్తర్వులతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube