మరో కేసును సీబీఐకి అప్పగించిన ఏపీ హైకోర్టు !

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా న్యాయమూర్తులపై అవాంఛనీయ రీతి లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన కేసును తాజాగా సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్రా హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

 Ap Highcourt, Cm Jagan, Ap, Ap Speker Tamminnei Sitaram , Cid, Cbi-TeluguStop.com

అలాగే ఈ కేసు పై 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

సోషల్ మీడియా లో ఇటీవల కూడా జడ్జిలపై వ్యాఖ్యలు చేసినవారి పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

ముఖ్యంగా, ఈ దర్యాప్తులో సీబీఐకి సహకరించాలంటూ ఏపీ ప్రభుత్వానికి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.న్యాయ వ్యవస్థలపైనా, న్యాయమూర్తులపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెరిగిపోతుండడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది.

ఈ మధ్య కొన్ని ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వచ్చిన నేపథ్యంలో జడ్జిల పట్ల అవమానకర రీతిలో పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపైనా న్యాయస్థానం దృష్టి సారించింది.

స్పీకర్ న్యాయవ్యవస్థలపై చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా పరిగణించి విచారించక తప్పదని హెచ్చరికలు చేసింది.న్యాయ‌మూర్తుల‌పై కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేసిన 90 మందికి పైగా హైకోర్టు ఆదేశాల‌తో సీఐడీ అధికారులు నోటీసులు పంపారు.

అయితే ఇంత వరకు ఏ ఒక్క‌ర్నీ అరెస్ట్ చేయ‌క‌పోవ‌డంతో సీఐడీ అధికారుల‌పై హైకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.దీనితో ఈ కేసుని సీఐడీ నుండి సీబీఐకి తరలించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube