ఏపీ పరిషత్ ఎన్నికలకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.రేపే పోలింగ్ నిర్వహించవచ్చని డివిజనల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది.
అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడించ కూడదు అని ట్విస్ట్ ఇచ్చింది.రాష్ట్రంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ ఒకటో తారీఖున ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయటం తెలిసిందే.
దీంతో 8వ తేదీ పోలింగ్ మరియు 10వ తేదీ ఓట్ల లెక్కింపు అన్న తరహాలో షెడ్యూలు ప్రకటించడం జరిగింది.
ఇలాంటి తరుణంలో ఎస్ఈసీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదు అని బిజెపి, జనసేన, టిడిపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫున వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం విచారణ చేసిన హైకోర్టు సింగిల్ జడ్జి ఇరుపక్షాల వాదనలు విని అనంతరం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ రిలీజ్ అయినా ఎస్ఈసీ నోటిఫికేషన్ పై స్టే విధించాలని కోరడం జరిగింది.
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు డివిజన్ బెంచ్‌కు ముందు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ వాదనలు విని అనంతరం ఎస్ఈసీ తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయడం జరిగింది.ఇదే తరుణంలో ఎస్ఈసీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
.