ఏబీ వెంకటేశ్వరరావు పిటీషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు  

AP high court dismissed AB Venkateswara Rao petition , AP high court, AB Venkateswara Rao petition ,IPS officer, Suspension - Telugu Ab Venkateswara Rao Petition, Ap High Court, Ap High Court Dismissed Ab Venkateswara Rao Petition, Ips Officer, Suspension

ఆయుధాల అక్రమ కొనుగోలు కేసు విషయంలో ఐపీఎస్‌ సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసినట్లు తెలుస్తుంది.ఆయుధాలు అక్రమ కొనుగోలు కేసు నమోదుపై అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

TeluguStop.com - Ap High Court Dismissed Ab Venkateswara Rao Petition

అయితే ఆ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి.

టీడీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు.అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

TeluguStop.com - ఏబీ వెంకటేశ్వరరావు పిటీషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆయనపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు కూడా వేసింది.అయితే ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించగా ఆయనకు అక్కడ కూడా చుక్కెదురైంది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ క్యాట్ కూడా ఆదేశాలు ఇవ్వడం తో ఆయన హైకోర్టు ను ఆశ్రయించారు.అయితే హైకోర్టు మాత్రం క్యాట్ ఆదేశాలను కూడా పక్కనపెట్టి ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది కూడా.

అయితే ఇప్పుడు తాజాగా ఆయుధాలు అక్రమ కొనుగోలు కేసు నమోదు పై అరెస్ట్ చేయకుండా కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి అని కోరుతూ ఆయన పిటీషన్ దాఖలు చేయగా, ఆ పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది.అంతేకాకుండా కేసు నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కేసును రిఫరెన్స్ గా కూడా ఇచ్చింది.
ఒకవేళ ఆ ప్రకారం కేసు నమోదు చేయకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేయాలని వెంకటేశ్వరరావుకు సూచించింది.కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం నిబంధనలను పాటించాలని, గైడ్‌లెన్స్‌ను ప్రభుత్వం పాటించకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

#APHigh #IPS Officer #Suspension #ABVenkateswara #AP High Court

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap High Court Dismissed Ab Venkateswara Rao Petition Related Telugu News,Photos/Pics,Images..