అచ్చెన్నాయుడు పిటీషన్ పై ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

టీడీపీ నేత,ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి అంటూ హైకోర్టు లో దాఖలు చేసిన పిటీషన్ పై తాజాగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

 Ap High Court Gave The Ordinance About The Ap Ex Minister Atchannaidu Petition,-TeluguStop.com

ఈ ఎస్ ఐ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గత కొద్దీ రోజులుగా జైలు లోనే ఉంటున్న విషయం విదితమే.అయితే ఆయన ఇటీవల ఒక శస్త్ర చికిత్స చేయించుకోగా ఆ గాయం ఇంకా కుదుటపడకుండానే ఆయనను అరెస్ట్ చేయడం తో ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని కావున ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని కోరుతూ కోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు.

అయితే ఈ పిటీషన్ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది వాదనలను తోసి పుచ్చుతూ ఆయనను వెంటనే గుంటూరు రమేష్ ఆసుపత్రికి తరలించాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఎస్ ఐ స్కాం కేసు విచారణలో ఉన్న అచ్చెన్నాయుడును ఇటీవల జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత జైలుకు తరలించారు.

ఈ క్రమంలో తన ఆరోగ్యం ఇంకా కుదట పడలేదని అందుకే ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది.

దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన్ను ఏ ఆస్పత్రికి తరలించాలన్నది. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్థారించాలంటూ వాధించారు.

అయితే ఆయన వాదనతో న్యాయమూర్తి ఏకీభవించకుండా ఆయనను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube