ఏపీలో లాక్ డౌన్ గురించి ఆరోగ్య శాఖ మంత్రి కీలక కామెంట్స్..!! 

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూ ఉండటంతో చాలా రాష్ట్రాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ విధంగా కర్ఫ్యూలు విధిస్తూ కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు.

 Ap Health Minister Sensational Comments On Ap Lock Down-TeluguStop.com

మరోపక్క తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో హైకోర్టు.

అక్కడి ప్రభుత్వాన్ని పబ్బులు, క్లబ్బులు, సినిమా థియేటర్లు  విషయంలో ఆంక్షలు విధించాలని తెలపడం జరిగింది.

 Ap Health Minister Sensational Comments On Ap Lock Down-ఏపీలో లాక్ డౌన్ గురించి ఆరోగ్య శాఖ మంత్రి కీలక కామెంట్స్.. -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ ఇంకా కరోనా ఆంక్షలు గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో కరోనా లాక్ డౌన్, రాత్రిపూట కర్ఫ్యూలు విధించే ఆలోచనలో ప్రభుత్వం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.ఇప్పటికే వ్యాక్సినేషన్  సెంటర్ల గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం రాష్ట్రంలో సిద్ధంగా ఉందని, కాబట్టి లాక్‌డౌన్‌ అనేది ఏపీలో లో అమలు అయ్యే ప్రసక్తి లేదు అన్నట్టు మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

Telugu Alla Nani, Andhra Pradesh, Corona Virus, Lock Down-Telugu Political News

ప్రస్తుతం మందులు మరియు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి కదా అంటూ ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని.కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావాలని ఆళ్లనాని స్పష్టం చేశారు.ప్రస్తుతం కేసులు పెరుగుతూ ఉండటంతో హాస్పిటల్ సంఖ్య కూడా పెంచడానికి సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు, ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చినట్లు ఆళ్ల నాని స్పష్టం చేశారు.

ఏదిఏమైనా రాష్ట్రంలో కోవిడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంకి  లాక్ డౌన్  లేదా నైట్ కర్ఫ్యూ అనే ఆలోచన లేదని తెలిపారు.

#Corona Virus #Alla Nani #Lock Down #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు