ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు గత కొన్ని రోజుల నుండి ప్రభుత్వంపై వ్యాక్సిన్ విషయంలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.కావాలని వ్యాక్సిన్ ఆర్డర్ చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఇటువంటి తరుణంలో ఈ విషయంపై నిన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది.దాదాపు రాష్ట్రంలో సంక్షేమం కోసం 87 వేల కోట్ల డబ్బు ఖర్చు చేయడం జరిగింది, వ్యాక్సిన్ కోసం 1600 కోట్లు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఉంటుందా అంటూ గట్టిగా ప్రతిపక్షాలకు కౌంటర్ వేశారు.
ఇదిలా ఉంటే తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.చంద్రబాబు వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.వ్యాక్సిన్ కొనుగోలు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నట్లు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు.అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వ్యాక్సిన్లను ఉచితంగా ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని .దీనికోసం 1600 కోట్లు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం వెనకాడటం లేదని తెలిపారు.వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి భారత్ బయోటెక్ ఎండి తో బంధుత్వం ఉన్న చంద్రబాబు మాట్లాడితే బాగుంటుంది .తమకు అభ్యంతరం లేదని ఆళ్ల నాని పేర్కొన్నరు.