కరోనా అంత్యక్రియలకు రూ.15 వేలు : ఏపీ ఆరోగ్య శాఖ  

ap, health department, corona funeral, money - Telugu Ap, Corona Funeral, Health Department, Money

రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిలో మార్పు లేదు.

 Ap Health Department Corona Funeral Money

కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు సంఖ్యను పెంచడంతో రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.వైరస్ సోకిన వారికి వైద్యసేవలు అందిస్తోంది ప్రభుత్వం.

ఆస్పత్రిలో, హోం క్వారంటైన్లలో కరోనా కిట్లను అందజేస్తుంది. బెడ్ల సంఖ్యను పెంచింది.

కరోనా అంత్యక్రియలకు రూ.15 వేలు : ఏపీ ఆరోగ్య శాఖ-Telugu Political News-Telugu Tollywood Photo Image

కఠిన నిబంధనలను అమలు చేస్తుంది.ఈ నెలలో వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం మెరుగైన సౌకర్యాల ఏర్పట్ల కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

తాజాగా ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు వెల్లడించింది.ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేశారు.ఇందులో కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు రూ.15 వేలు అందించనుంది.కరోనాను నిర్మూలించడానికి ప్లాస్మా అవసరం కాబట్టి ప్లాస్మాదాతలకు రూ.5 వేలు అందించనున్నట్లు ప్రభుత్వం ఆమోదించింది.ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల అమలుకు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.కాగా, ఈ డబ్బును కుటుంబసభ్యులకు ఇస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.దీనికి అవసరమైన నిధులు ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం విడుదల చేయనుంది.

#Corona Funeral #Money

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Health Department Corona Funeral Money Related Telugu News,Photos/Pics,Images..