బాబు పై నిఘా నిజమేనా ?

టీడీపీ అధినేత చంద్రబాబు లో ఇప్పుడు నిఘా భయం ఎక్కువ అయినట్టుగా కనిపిస్తోంది.ఎప్పుడైతే పార్క్ హయత్ హోటల్ లో తనకు అత్యంత సన్నిహితులైన బిజెపి నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్యంగా భేటీ అవ్వడం, దానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ బయటకు రావడం, దీనిపై వైసీపీ ప్రభుత్వం పెద్ద రాద్దాంతం చేయడం, ఈ వ్యవహారంలో మొదటి నుంచి వైసిపి చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరడం, వంటి పరిణామాలతో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంది.

 Ap Govt Tracking Movements Of Chandrababu, Chandrababu Naidu, Ap Govt, Ys Jagan,-TeluguStop.com

అది అలా ఉంచితే ఇప్పుడు తనపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రెండు పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేశామని, తన కదలికలు పూర్తిగా తెలుసుకుంటూ, తనను ఎవరెవరు కలుస్తున్నారు ? ఎప్పుడు కలుస్తున్నారు ? ఎక్కడ కలుస్తున్నారు వంటి పూర్తి వివరాలను ఆరా తీస్తున్నట్లు గా చంద్రబాబు లో ఇప్పుడు అనుమానం మొదలైంది.

ఏపీ తెలంగాణ రెండు ప్రభుత్వాలు తను బద్ధశత్రువుగా చూస్తూ ఉండడం తో, చంద్రబాబు శని, ఆదివారాల్లో జాతీయ మీడియా తో పాటు జాతీయ స్థాయి నాయకులను, ఏపీ తెలంగాణకు చెందిన అత్యంత సన్నిహితులైన వ్యక్తులను కలుస్తూ ఉంటారు.

కానీ ఇప్పుడు తన కదలికపై నిఘా పెరిగింది అనే అనుమానం పెరగడంతో చంద్రబాబు శని, ఆదివారాల్లో రహస్యంగా జరిగే అంతర్గత సమావేశాలను మొత్తం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.చంద్రబాబులోనే కాక టిడిపికి చెందిన కీలక నాయకులు అందరి కదలికలపైనా ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టినట్టు అనుమానిస్తున్నారు.

Telugu Ap, Ap Chandrababu, Bjp, Chandrababu, Ys Jagan-Telugu Political News

అందుకే కొద్దిరోజుల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే పార్టీ కీలక నాయకులు అందరికీ చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాదు నివాసం వద్ద కూడా ఏపీ పోలీసుల పహారా ఉంటోంది.దీనికి తోడు తెలంగాణ చెందిన నిఘా బృందాలు చంద్రబాబు కదలికలపై ఆరా తీస్తున్నట్లు ఇప్పుడు టిడిపి అనుమానం వ్యక్తం చేస్తోంది.అయితే ఈ విషయాన్ని బహిరంగంగా వ్యాఖ్యానిస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని, టిఆర్ఎస్ ఒక్కసారిగా విమర్శల దాడి చేసే అవకాశం ఉందని గ్రహించిన చంద్రబాబు ఈ విషయం పైకి చెప్పకుండానే అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube