ఉద్యోగులు, ఫించనర్లకు ఏపీ ప్రభుత్వం షాక్

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.కరువు భత్యాన్ని నిలిపివేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

 Ap Govt Shock To Employees, Ap Govt, Ys Jagan, Pensioners-TeluguStop.com

కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో డీఏ నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.కరువు భత్యం నిలిపివేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్ల కరువు భత్యం నిలిపివేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.దీంతో కేంద్ర ఆదేశాల మేరకు కరువు భత్యం నిలిపివేస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరువు భత్యం నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

2021 వరకు కరువు భత్యం చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఉద్యోగులు, పించనర్లు దీనికి సహకరించాలని ఆయన కోరారు.ఆర్థిక పరిస్థితుల వల్ల కేంద్ర ఆదేశాల ప్రకారమే ఈ నిర్ఱయం తీసుకున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కరువు భత్యం నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులు, ఫించనర్లకు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.ఈ నిర్ణయంపై ఉద్యోగులు, ఫించనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి చూడాలి దీనిపై ఉద్యోగులు ఏం చేస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube