మాములోడివి కాదయ్యా 'బాబు' .. సీబీఐ నే నిషేధించాడు !   Ap Govt Sensational Decision No Entry For CBI Into Ap     2018-11-16   10:50:17  IST  Sai M

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాలు.. ఆలోచనలు ఎవరికీ అర్ధం కావు. ఆయన నిర్ణయాలు ఒక్కొక్కసారి బాగానే ఉన్నాయనిపించినా… కొన్ని కొన్ని ఆయన భయాన్ని తెలియజేస్తుంటాయి. తాజాగా.. ఏపీ కి సంబందించిన వ్యవహారాల్లో … సీబీఐ ఏపీలో దర్యాప్తులను చేపట్టకుండా .. నిషేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సంచలనంగా మారాయి. సీబీఐ అంటే చాలు ఎందుకో వణుకుతున్నారు. ఏపీలో బహిరంగంగానే వేల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఐటీ దాడులు ఎక్కడ జరిగినా ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు హడలిపోతున్నారు. ఐటీ దాడులకు వచ్చే అధికారులకు పోలీసు భద్రత కల్పించబోమని బహిరంగంగానే చెప్పేస్తున్నారు.

సీబీఐ రాకను బాబు ఇంత అకస్మాత్తుగా.. నిషేధించడంపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నేరాలను పరిశోధన చేయడానికి సీబీఐ అక్కర్లేదని చంద్రబాబు ప్రభుత్వం తేల్చేసింది. రాష్ట్రంలో దాడులు, దర్యాప్తులు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ ద్వారా పని చేస్తున్న సీబీఐ. ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లో పని చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి ఉండాలి. సీబీఐ లాంటి సంస్థలతో దర్యాప్తు చేయించాల్సిన వ్యవహారాలు చాలా ఉంటాయి కాబట్టి అన్ని రాష్ట్రాలూ సీబీఐకి అనుమతులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎప్పటి నుంచో సీబీఐని ఆహ్వానిస్తోంది. అయితే చంద్రబాబు, టీడీపీ నేతలు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీబీఐ విచారణకు అవకాశం ఉంటుందన్న భయంతోనే చంద్రబాబు ఇప్పుడు సీబీఐతో ఆంధ్రప్రదేశ్‌కు అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసినట్టు కధనాలు వినిపిస్తున్నాయి.

Ap Govt Sensational Decision No Entry For CBI Into Ap-Central Cm Chandrababu

అంతే కాకుండా… ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి వ్యవహారంలో ఏపీ పోలీసుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అంతే కాదు. ఈ వ్యవహారంపై సీబీఐ చే విచారణ చేయించాలని వైసీపీ కోరుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. హైకోర్టు కూడా ఏపీ పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్టులో మూడు నెలలుగా సీసీ కెమెరాలు లేకపోవడం పైనా అనుమానం, ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో జగన్‌పై హత్యాయత్నం కేసును హైకోర్టు సీబీఐకి అప్పగిస్తే చంద్రబాబుకు ఇబ్బంది తప్పదు. అందుకే ఇవన్నీ ముందుగా ఆలోచించిన బాబు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.