హమ్మయ్య... ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ ...!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చులకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోవడంతో ఏపీలోని ఉద్యోగుల జీతాలు లైన్ క్లియర్ అయినట్లు అయింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ద్రవ్య నియమ బిల్లుకు గురువారం నాడు ఆమోదాన్ని తెలిపారు.

 Govt Employees, Salaries, Chandrababu Naidu, Ap Government, Salaries To Employee-TeluguStop.com

ఈ అమోదం తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల చెల్లింపులకు, మరోవైపు ఇతర రంగాలకు చెందిన ఆర్థిక బిల్లులు చెల్లింపులకు అడ్డంకి తొలగింది.

ఇకపోతే ఈ ద్రవ్య వినిమయ బిల్లుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాసనమండలిలో ఆమోదించకుండా అడ్డుకున్న సంగతి అందరికీ విదితమే.

ఈ నేపథ్యంలో బాబు సూచనలతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఈ బిల్లుకు ఆమోదించకుండా సభను నిరవధికంగా వాయిదా వేస్తూ వచ్చారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తారీఖున రాష్ట్ర ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లకు జీతాలను ఇవ్వలేకపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో శాసనమండలి బిల్లును ఆమోదించ లేకపోతే ఆ బిల్లును 14 రోజుల తర్వాత రాష్ట్ర గవర్నర్ కు ఆమోదించే అధికారం ఉంది.దీంతో 14 రోజుల గడువు ముగిసిపోవడంతో గురువారం నాడు గవర్నర్ ఆఫీస్ కు ద్రవ్య వినిమయ బిల్లులు పంపగా అక్కడ గవర్నర్ సాయంత్రానికి ఆమోదం తెలిపారు.

ఈ సందర్భం తర్వాత ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది.దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, పెన్షనర్లకు జీతాలు లైన్ క్లియర్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube