ఏపీ అనుమతులు ఇచ్చింది కదా, షూటింగ్స్‌ అక్కడ ఎందుకు చేయరు?  

Andhra Pradesh, Telangana, Government, Movie Shooting, Permission, Corona Cases - Telugu Andhra Pradesh, Corona Cases, Government, Movie Shooting, Permission, Telangana

రెండు వారాల క్రితమే ఏపీ ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చింది.కాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు వెనుక ముందు ఆడుతోంది.

 Ap Govt Movie Shooting Permission

జూన్‌ 1 నుండి షూటింగ్స్‌కు ఓకే చెప్పే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.కాని ఇప్పట్లో షూటింగ్‌ అనుమతులు వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వక పోవడంపై ఏపీకి వెళ్లి షూటింగ్‌కు వెళ్లవచ్చుగా అంటున్నారు.కాని ఎక్కువ శాతం షూటింగ్స్‌ హైదరాబాద్‌లోనే చేయాల్సి ఉంది.

ఏపీ అనుమతులు ఇచ్చింది కదా, షూటింగ్స్‌ అక్కడ ఎందుకు చేయరు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఒకటి రెండు షూటింగ్స్‌ ఏపీలో చేసుకునే అవకాశం ఉన్నా కూడా అక్కడకు వెళ్లేందుకు కూడా పర్మీషన్స్‌ దక్కడం లేదు.ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చింది కాని షూటింగ్స్‌కు వెళ్లేందుకు మాత్రం ఏ ఒక్కరు ఆసక్తి చూపడం లేదు.

హైదరాబాద్‌లో కాకుండా అక్కడ షూటింగ్‌కు వెళ్లాలి అంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున కసరత్తులు చేయాల్సి ఉంటుంది.అందుకే అక్కడకు వెళ్లేందుకు మాత్రం యూనిట్‌ సభ్యులు ఆసక్తి చూపడటం లేదు.

ముఖ్యంగా ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా అక్కడ షూటింగ్స్‌ చేసేందుకు ఆందోళన వ్యక్తం అవుతుంది.అందుకే షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చినా కూడా అక్కడ షూట్స్‌ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.ఇప్పుడే కాదు భవిష్యత్తులో అంటే రాబోయే మూడు నాలుగు నెలల వరకు కూడా షూటింగ్స్‌ అక్కడ జరుగక పోవచ్చు అంటున్నారు.స్టూడియోల్లో మాత్రమే షూటింగ్స్‌ చేయాలని భావిస్తున్నారు.

కనుక ఏపీలో స్టూడియోలు లేకపోవడం అక్కడక షూటింగ్స్‌ జరగడం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Govt Movie Shooting Permission Related Telugu News,Photos/Pics,Images..