చిరు వ్యాపారుల కోసం కొత్త పథకం

ఇవాళ సచివాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ ఎప్పుడో జరగాల్సి ఉండగా.

 Ap Cabinet Key Decisions  Ap, Jagan, Chedodu Vadhodu, Ap Cabinet Meeting, Jagan-TeluguStop.com

సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన, కొన్ని అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది.అయితే ఎట్టకేలకు చాలారోజుల తర్వాత నేడు జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సబ్ కమిటీ నివేదిక ప్రకారం కొత్త ఇసుక పాలసీకి ఆమోదముద్ర వేశారు.వరదల వల్ల కొద్ది నెలలుగా ఇసుక తీయకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది.ఈ క్రమంలో కొత్త ఇసుక పాలసీ వల్ల ఇసుక కష్టాలు తీరే అవకాశముంది.కొత్తగా తీసుకురానున్న ఈ పాలసీ ప్రకారం అన్ని రీచులను ఒకే సంస్థకు ప్రభుత్వం అప్పగించనుంది.

అన్ని రీచులను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.ఇక మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్.చిరు వ్యాపారుల కోసం జగనన్న చేదోడు పథకానికి కూడా ఆమోదం తెలిపింది.

నవంబర్ 24న జగనన్న చేదోడు పథకం ప్రారంభించనున్నారు.ఇక జనవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube