రైతుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్  

ap-govt-good-news-to-formers - Telugu Accounts, Floods, Formers, Inpute Subsididy, Money

రైతుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది.రూ.113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఇవాళ వీటిని నేరుగా రైతు ఖాతాల్లో జ‌మ చేసింది.ఇటీవ‌ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా.నేడు వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్ట‌పోయిన రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ చేసిన‌ట్లు తెలిపింది.పంట న‌ష్టంపై జిల్లాల అధికారులు ఇచ్చిన నివేదిక ప్ర‌కారం ఈ నిధులు అందించిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

TeluguStop.com - Ap Govt Good News To Formers

కృష్ణా, గోదావరి, కుందూ నది వరదలతో 33శాతం కంటే ఎక్కువగా దెబ్బతిన్న పంటలకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తింప చేసిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.వ‌ర‌ద‌ల‌తో పంట న‌ష్ట‌పోయిన ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల రైతుల ఖాతాల్లోకి నేరుగా ఈ ఇన్‌పుట్ సబ్సిడీని జ‌మ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.‌7,757 హెక్టార్లల్లో పంట నష్టానికి ఈ ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేశామ‌ని, 17,872 మంది పంట‌ నష్టపోయిన రైతులకు దీని వ‌ల్ల ల‌బ్ధి జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో అందిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

TeluguStop.com - రైతుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్-General-Telugu-Telugu Tollywood Photo Image

జూన్, జూలై, ఆగస్టుతో పాటు, సెప్టెంబరు నెల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇవాళ ప్ర‌భుత్వం అందించింది.అయితే అక్టోబరు నెలకు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీపై నవంబరు 15లోగా నివేదిక ఇవ్వాలని సీఎం వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో అక్టోబర్ నెల‌కు సంబంధించిన ఇన్‌పుట్ స‌బ్సిడీ కూడా త్వ‌ర‌లో రైతుల‌కు అంద‌నుంది.

#Formers #Accounts #Floods #Money

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Govt Good News To Formers Related Telugu News,Photos/Pics,Images..