అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త !  

  • ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం ఒక్కో సమస్యను అధిగమిస్తూ … ముందుకు వెళ్తోంది. దీనిలో భాగాంగానే చాలాకాలంగా అనేక ఉద్యమాలతో … పోరాటాలు చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటనిచ్చేలా వారికి శుభవార్త అందించింది. బాధితులకు 250 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డబ్బు 10 వేల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు ఉపయోగపడబోతోంది.

  • Ap Govt Good News For Agrigold Victims-

    Ap Govt Good News For Agrigold Victims

  • ఈ నేపథ్యంలోనే…. అగ్రిగోల్డ్ బాధితులకు 250 కోట్ల రూపాయలు కేటాయిస్తూ గురువారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10వేల రూపాయల లోపు డిపాజిట్లు కలిగిన బాధితులు 3.5 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారికి ప్రభుత్వం తరపునే సహాయం చెయ్యాలని ఇటీవల క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జిల్లా స్థాయి కమిటీల ద్వారా చెల్లింపులు చేయాలని మరోసారి స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం.