నిమ్మగడ్డకు వ్యతిరేకంగా మరోసారి హైకోర్టుకు  

ap-govt-go-to-highcourt-aganist-ramesh-kumar - Telugu Ap, Cec, Elections, Govt, Highcourt, Local Body, Ramesh Kumar

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు.అన్ని పార్టీలు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తమ అభిప్రాయాలను చెప్పాలని కోరారు.

TeluguStop.com - Ap Govt Go To Highcourt Aganist Highcourt

కరోనా ప్రభావం తగ్గిన క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించుకున్నామన్నారు.

అయితే కరోనా ప్రభావం క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే దానిపై రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరై అభిప్రాయాలు చెప్పాలన్నారు.

TeluguStop.com - నిమ్మగడ్డకు వ్యతిరేకంగా మరోసారి హైకోర్టుకు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో సహా జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి.కానీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకావడం లేదని తెలిపింది.

ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రకటన విడుదల చేశారు.

ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఇవాళ నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఆశ్రయించింది.ఈ మేరకు హైకోర్టులో ఏపీ ప్రభుత్వం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

నిమ్మగడ్డ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో.ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మరి దీనిపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి.

#Local Body #Govt #Ramesh Kumar #Highcourt #Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Govt Go To Highcourt Aganist Highcourt Related Telugu News,Photos/Pics,Images..