సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు

ఏ‌పి లో పంచాయతీ ఎన్నికలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు, రాష్ట్ర ప్రభుత్వం, ఈ‌ఎస్‌సి కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్లను ధాఖలు చేశాయి.

 Ap Govt Employees Union Leaders Takes U Turn After Supreme Courts Verdict, Ap Go-TeluguStop.com

ఈ నేపథ్యంలో నేడు సుప్రీం కోర్టు తన తీర్పును ఇచ్చింది.ఉద్యోగ సంఘాల తీరుపై సుప్రీం కోర్టు మండిపడింది.

అసలు ఎన్నికల నిర్వహణలో ఉద్యోగ సంఘాల ఇన్వల్వ్మెంట్ ఏమిటి అని ప్రశ్నించింది.తక్షణమే ఎస్‌ఈ‌సి కి సహకరించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ మేము పంచాయతీ ఎన్నికలకు వ్యతిరేకం కాదు.
మేము ఎన్నికల నిర్వహణలో పాల్గొనడం లేదని ఎప్పుడు చెప్పలేదు.

కాకపోతే మా ఉద్యోగుల్లో కొంత మంది కరోనాతో బాదపడుతున్నారు.వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారులు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు.

అప్పటి వరకు వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నాడు.మిగతవారితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎస్‌ఈ‌సి కి తెలియజేసినట్లు చెప్పాడు.

ఈ విషయంపై ఏ‌పి ఎన్‌జి‌ఓ చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.వ్యాక్సిన్ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టును కోరాడు.అందుకే సుప్రీం కోర్టులో ఇంప్లిడ్ పిటిషన్ వేసినట్లుగా చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మౌనంగానే ఉంది.ఎస్‌ఈ‌సి మాత్రం మరింత స్పీడ్ ను పెంచుతూ ఎన్నికల నామినేషన్స్ కు అన్నీ ఏర్పాట్లను చేస్తుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube