కేంద్రం దృష్టికి ఫోన్‌ ట్యాపింగ్‌

టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ముడుపుల వ్యవహారం తెలుగు ప్రభుత్వాల మధ్య చిచ్చు పెట్టింది.ఓ ఎమ్మెల్యే వ్యవహారం ముఖ్యమంత్రుల మధ్య పగ, ప్రతీకారం చెలరేగడానికి కారణమైంది.

 Ap Govt Mounts Counter Attack On Trs-TeluguStop.com

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొందరు మంత్రులు, నాయకుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్‌ చేయిస్తోందన్న అనుమానాలు బలపడ్డాయి.ఏపీ ప్రభుత్వ పాలన కూడా హైదరాబాదు నుంచి జరుగుతున్నందున అక్కడి ఆ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫోన్లను టీ-ప్రభుత్వం ట్యాప్‌ చేయిస్తోందని అంటున్నారు.

ఏపీ డీజీపీ రాముడు దీనిపై విచారణకు కూడా ఆదేశించారు.ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.

చంద్రబాబు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన సమాచారం తమ దగ్గర ఉందని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పబ్లిగ్గా చెప్పడంతో ఫోన్‌లు ట్యాప్‌ చేస్తున్నారనే అనుమానం కలిగి, అది బలపడింది.ఆంధ్రా హోం మంత్రి చినరాజప్ప ఫోన్‌ ట్యాపింగ్‌ నిజమేనని తెలిసిందన్నారు.

ఇప్పడీ తగాదా కేంద్రం వద్దకు చేరుతోంది.ఉమ్మడి రాష్ర్టం విడిపోయినప్పటి నుంచి తెలుగు రాష్ర్టాల మధ్య అనేక గొడవలు జరిగాయి.

రాష్ర్ట గవర్నర్‌గాని, కేంద్రంగాని ఏం పరిష్కరించాయి? ట్యాపింగ్‌ వ్యవహారమూ ఇంతే…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube