ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శుభవార్త..!

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుండి సీఎం జగన్ ప్రజలకు వరాలు ఇస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదిరిపోయే శుభవార్తను అందించింది.

 Ap Government Says Good News Sc St Bc Category People-TeluguStop.com

ఇక నుండి ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కుల ధృవీకరణ పత్రం(క్యాస్ట్ సర్టిఫికెట్) కోసం తిరగాల్సిన పని లేకుండా చేసింది.

ఎలా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఇక నుండి క్యాస్ట్ సర్టిఫికెట్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది.దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే పని ప్రారభించారట.కాగా ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను డిప్యూటీ ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్లు మంజూరు చేస్తూ వచ్చారు./br>

అయితే ఇక ఆ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారులను గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం అప్పగించనున్నట్టు సమాచారం.

అయితే ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల కోసం ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రం తహశీల్దార్, అంతకన్నా పైస్థాయి అధికారి మంజూరు చేస్తారు.మార్చి నెలాఖరు నుండి ఈ విధానం అమలులోకి వస్తుంది.

ఏది ఏమైనా ఇన్నాళ్లు చెప్పులరిగేలా తిరిగిన ప్రతి ఒక్కరికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube