కరోనా టెస్టుల ధరలు తగ్గించిన ఏపీ ప్రభుత్వం..!

ఏపీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఏపీలో నిత్యం కొద్దీ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.

 Ap, Cm Jagan, Corona Test, Reduces Tests-TeluguStop.com

ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అక్కడి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఈ మహమ్మారి బారి నుండి కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుంది.ఇప్పటికే కరోనా రోగులు మెనూలోను మార్పులు చేసింది.

అంతేకాకుండా రాష్ట్రంలో వేగంగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.తాజాగా ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో చాల మంది కరోనా టెస్టులు చేయించుకోవడానికి ప్రైవేట్ ల్యాబ్ ల చుట్టూ తిరుగుతున్నారు.దీంతో కొంతమంది వచ్చిందే సమయం అనుకోని టెస్టుల పేరుతో డబ్బులు గుంజుతున్నారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్దారణ పరీక్షల ధరలను తగ్గిస్తున్నట్లు ఆదేశాలను జారీ చేసింది.అయితే గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్‌కు రూ.2400 ఉన్న ధరను రూ.1600కు చేరిందని ప్రభుత్వం తెలియజేసింది.అంతేకాకుండా ప్రైవేట్‌గా ల్యాబ్స్‌లో టెస్ట్ కోసం గతంలో నిర్దేశించిన రూ.2900 ధరను రూ.1900 తగ్గిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.అంతేకాక తగ్గిన ధరల ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రజలకు అందుబాటులోకే తీసుకరావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube