పుండు మీద కారం చల్లుతున్న ఏపీ సర్కార్...బాబు కుటుంబ భద్రత కుదింపు  

Ap Government Reduced Chandrababu Family Members Security-

పుండు మీద కారం చల్లినట్లు ఏపీ సర్కార్ తీరు తయారైంది.ఒకపక్క ఓటమి భారం తో తలమునకలు అవుతుంది, మరో పక్క పార్టీలో జంప్ జిలాని లతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పి గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మాజీ సీ ఎం కు అందించిన భద్రత ను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వేడి పుట్టిస్తుంది.

Ap Government Reduced Chandrababu Family Members Security--AP Government Reduced Chandrababu Family Members Security-

ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన బాబు కుటుంబం నిన్ననే వచ్చిన సంగతి తెలిసిందే.అయితే బాబు కుటుంబం కు కేటాయించిన భద్రత ను తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Ap Government Reduced Chandrababu Family Members Security--AP Government Reduced Chandrababu Family Members Security-

గతంలో జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న లోకేష్ కు భద్రత తగ్గించింది ఏపీ సర్కార్.గతంలో 5+5 భద్రతా ఉండగా, ఇప్పుడు దానిని 2+2 కు కుదించింది.అలానే మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా భద్రతను తొలగించినట్లు సమాచారం.అయితే ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో టీడీపీ వర్గాలు తప్పుపడుతున్నాయి.

విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ విధంగా బాబు కుటుంబానికి అందించే భద్రతను తొలగించడం పై వారు తప్పుపడుతున్నారు.వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేతగా,పాదయాత్రలో కూడా కావాల్సినంత భద్రత టీడీపీ సర్కార్ అందించింది అని,కానీ వారు అధికారంలోకి రాగానే చంద్రబాబు పై వారి కుటుంబం పై కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.అయితే ఏపీ పోలీసులు మాత్రం భద్రతను పూర్తిగా తొలగించలేదని,కేవలం కుదించినట్లు స్పష్టం చేస్తున్నారు.