జల వివాదం.. తెలంగాణపై సుప్రీంకోర్ట్ లో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం..!

కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతుంది.తెలంగాణా, ఏపీ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ గొడవపై రాజకీయ నేతలు కూడా మాటల తూటాలు వదులుతున్నారు.

 Ap Government Petition In Suprem On Telangana Krishna Water Dispute Ap, Disput-TeluguStop.com

ఈ నేపథ్యలో వాటాకు మించి తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకుంటుందని ఏపీ ఎక్కువ వాడుతుండని తెలంగాణా ప్రభుత్వాలు ఆరోపించుకుంటున్నాయి.ఏపీ సీఎం జగన్ దీనికి సంబందించి ప్రధాని మోడీకి లేఖ రాశారు.

లేటెస్ట్ గా తెలంగాణ ప్రభుత్వ విషయంలో సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది.తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాకు తెలంగాణా ప్రభుత్వం అడ్డు పడుతుందని సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసింది ఆంధ్ర ప్రభుత్వం.

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ పరిధిని నోటిఫై చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది.తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని.

తాగు, సాగు నీటిని ఏపీ ప్రజలకు దక్కకుండ చేయాలని చూస్తున్నారని పిటిషన్ లో చెప్పారు.రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఉల్లఘిస్తుందని అన్నారు.

కృష్ణ జలాల పంపిణీ విషయంలో అవార్డ్లను అనుసరించడం లేదని జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ని రద్దు చేయాలని సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసింది ఏపీ ప్రభుత్వం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube