బాబు లేఖను పట్టించుకోని వైసీపీ సర్కార్...ప్రజా వేదిక స్వాధీనం కి ఆదేశం

అధికారం కోల్పోయిన తరువాత టీడీపీ పార్టీ పరిస్థితి మనుగడ కూడా కోల్పోయే పరిస్థితుల్లో పడిపోతుంది.రోజు రోజుకి ఆ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.

 Ap Government Not Accepted To Hand Over The Prajavedika To Tdp Party1-TeluguStop.com

నిన్న రాజ్యసభ టీడీపీ ని బీజేపీ లో విలీనం చేయమంటూ జంప్ జిలానీ లు అయిన సుజనా,టీజీ,సి ఎం రమేష్,గరికపాటి లు కోరగా,ఇప్పుడు తాజాగా ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఏపీ సీఎం గా వై ఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత టీడీపీ అధినేత,మాజీ సి ఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి లో ఆయన నివాసం పక్కన ఉన్న ప్రజావేదికను తమకు కేటాయించాలి అంటూ తోలి లేఖను రాశారు.

అయితే ఆ లేఖను ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ సర్కార్ ఆ ప్రజావేదికను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంది.ఈనెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని, అందుకుగానూ గుంటూరు జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ అధికారులు ప్రజావేదిక వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు.

ఈ క్రమంలో టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తీసుకువెళ్లాలని ఆ పార్టీ నేతలకు సీఆర్డీఏ అధికారులు సూచించినట్లు తెలుస్తుంది.తొలుత సచివాలయం ఐదో బ్లాక్ లో ఈ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపిన సర్కార్ ఇప్పుడు ఉన్నట్టుండి ప్రజావేదిక లో ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామంటూ ప్రకటన విడుదల చేసింది.

-Telugu Political News

అయితే ఈ చర్యను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు.లేఖ ద్వారా అభ్యర్ధన చేసినప్పటికీ ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని, అందులోనూ పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొని ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడం దారుణమంటూ వ్యాఖ్యానిస్తున్నారు.కనీస సమాచారం ఇవ్వకుండా ప్రజావేదికను ఎలా స్వాధీనం చేసుకుంటారని, సీఎం ఉపయోగించిన భవనాన్ని ఖాళీ చేయాలంటే ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube