అమూల్‎తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ సర్కారు..!

రాష్ట్ర పరిశ్రమ రంగంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.భారతదేశ డెయిరీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమూల్ సంస్ధతో ఏపీ సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

 Ap Government, Cm Jagan, Amul Dairy, Devlopment Sector, Mou-TeluguStop.com

ఏపీకి, అమూల్ కు ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగు అని అన్నారు సీఎం జగన్.రాష్ట్ర మహిళల జీవితాలను మార్చే దిశగా ఈ ఒప్పందం ఓ గొప్ప అడుగని సీఎం జగన్ పేర్కొన్నారు.

అమరావతిలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పంద ప్రతాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్ సంతకాలు చేశారు.వీడియో కాన్ఫరెన్స్ ధ్వారా అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి అనంద్ తో సీఎం జగన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.ఈ ఒప్పందంతో పాడి రైతులకు మెరుగైన ధరలు అందడమే కాకుండా, వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు.

రాష్ట్రంలోని సహకార సంఘాల డెయిరీలకు ప్రపంచ స్థాయి డెయిరీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే వీలుందని తెలిపారు.డెయిరీ రంగంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ ముఖద్వారంలా నిలుస్తుందని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ సొంత కంపెనీ హెరిటేజ్ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారని సీఎం జగన్ విమర్శించారు.దీంతో గతంలో ప్రభుత్వ సహకారం రంగం బలంగా ఉన్న పోటీ వాతావరణం ఉండక పోవడంతో.

డెయరీలు రాజీ పడిపోయాయని అన్నారు.అమూల్ తో భాగస్వామ్యం ద్వారం ఈ రంగంలో మార్పులను ఆశిస్తున్నామని.

రైతులకు సహకార రంగానికి మేలు జరుగుతుందని భావిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube