జర్నలిస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. !

కరోనా సృష్టిస్తున్న ప్రళయంలో అన్ని రంగాల వారు సమిధలు అవుతున్న విషయం తెలిసిందే.నిజానికి గత సంవత్సరం నుండి గడిచిపోతున్న రోజులను చూస్తుంటే ఈ రోజు బాగుంటే చాలు అనేలా సాగిపోతున్నాయి.

 Ap Government Makes Key Decision In Case Of Journalists, Ap Govt, Key Decision,-TeluguStop.com

ఎందుకంటే ఎటువైపు నుండి గోతికాడ నక్కలా కాచుకుని కూర్చున్న కరోనా చటుక్కున అంటెస్తుందో అనే భయం వల్ల కొందరి మానసిక స్దితి కూడా దెబ్బతింటున్న కేసులు వెలుగు చూస్తున్నాయి.

ఇక ఈ కరోనా సమయంలో బలవుతున్న వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు.

తన ప్రాణాలను పణంగా పెట్టి వార్తలు సేకరిస్తున్న ఎందరో జర్నలిస్టులు ఈ సెకండ్ వేవ్ వల్ల మట్టిలో కలిసిపోయారు.ఇలా కలం యోధులు కరోనా పోరులో మరణించడం దురదృష్టకరం.

ఇకపోతే ఇలా మరణించిన వారికి అండగా ఉంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.జర్నలిస్టుల కోసం ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటుంది.అంతే కాకుండా సీఎం సహాయనిధి నుంచి కరోనాతో మృతిచెందిన జర్నలిస్టులకు రూ.5లక్షలు పరిహారంగా ప్రకటించింది ఈ ప్రభుత్వం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube