ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధర విషయంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్లాక్ టికెట్ మార్కెట్ కు చెక్ పెడుతూ… ప్రేక్షకుల జోబికి చిల్లు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వినోదం అందరికీ అందుబాటులో ఉండే రీతిలో థియేటర్ లకి ఇప్పటికే కొన్ని హెచ్చరికలు చేయడం జరిగింది.
గతంలోనే ఈ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ తీసుకొస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే.
ఈ టికెట్ విధానం విషయంలో టాలీవుడ్ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారు.ఇండస్ట్రీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలతో ప్రభుత్వ అధికారులు భేటీ అయి… వారికున్న అనుమానాలు తొలగించి ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానం తీసుకురావటం జరిగింది.
ఈ విధానానికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది.క్షుణ్ణంగా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన గైడ్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి….
నోడల్ ఏజెన్సీ గా APFDC కి సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలు.

రాష్ట్రంలో అన్ని థియేటర్లు APFDC తో అగ్రిమెంట్ చేసుకోవాలి.అన్ని థియేటర్లు, ప్రయివేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి.ప్రతి టికెట్ పై 2 శాతం సర్వీస్ చార్జీ.ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ థియేటర్లు ఏర్పాటు చేసుకోవాలి.థియేటర్ల లో పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలి.కొత్త సినిమాకు వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మాలి.
