జగన్ కు ఎన్ని తంటాలో ? ఎలా గట్టెక్కిస్తారో ?

ఏపీ సీఎం జగన్ నిజంగానే మొండిగా ముందుకు వెళ్తున్నారు.ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురవుతున్నా, చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు.

 Ap Government Struggling With Funding Problems, Ys Jagan, Money, Jagan New Schem-TeluguStop.com

నలువైపుల కష్టాలు చుట్టుముడుతున్నా ఎక్కడా కంగారుపడటంలేదు.ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ జనాలకు ఎన్నో వరాలు ప్రకటించారు.

పార్టీ అధికారంలోకి రాగానే తాను చేస్తానని ప్రకటించిన అన్ని పథకాలను సక్రమంగా అమలు చేసి చూపిస్తున్నారు.వేలాది కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ తో కూడుకున్న పథకాలను ప్రకటించి జనాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నారు.

  2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమ పథకాలు అమలు చేద్దామని చూస్తే, 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయి.
అప్పటికే రెండు లక్షల కోట్ల వరకు అప్పులు ఏపీకి ఉన్నాయి.

అయినా జగన్ మాత్రం ఎక్కడా కంగారు పడడం లేదు.వివిధ సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినా జగన్ ప్రవేశపెట్టిన పథకాల ఖర్చుతో పోలిస్తే, వచ్చే రాబడి అంతంతే.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జగన్ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలోనే సుమారు 97 వేల కోట్లు అప్పులు తీసుకువచ్చారు.ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు.ఇంకా ఎన్ని అప్పులు తెచ్చినా సరిపోయే పరిస్థితి లేదు.మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం పెరిగే మార్గం లేకపోగా, జగన్ నిర్ణయాలతో మరింత ఆదాయం తగ్గుతూ వస్తోంది.

Telugu Ap Problems, Budget, Jagan Schemes, Liquor Ban, Ycp, Ys Jagan-Telugu Poli

మద్యం ద్వారా భారీ ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం గతంలో వచ్చేది.కానీ జగన్ విడతల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తుండడంతో, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతూ వస్తోంది.అయినా జగన్ ఇవేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.కొత్తగా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు.జగన్ అధికారంలోకి వచ్చాక తన హామీలు నెరవేర్చుకునేందుకు ఎక్కడా వెనకాడటం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వత ప్రతి కుటుంబానికి కనీసం 60 వేలకు తక్కువ కాకుండా ఈ ఏడాదిలో నగదు బదిలీ చేశారు.

అంటే నెలకు ఐదు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు  వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది.అదంతా అప్పులు తెచ్చిన సొమ్ములే.

జగన్ సంక్షేమ పథకాలతో అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయి.
మరోవైపు కేంద్రం నిధులు విడుదల చేయకుండా, కొత్త అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇస్తోంది.

ఇక ముందు ముందు ప్రభుత్వ పథకాలను నిరాటంకంగా అమలు చేయాలంటే, తప్పనిసరిగా కొత్త అప్పులు చేయాల్సిందే.ఇలా చేసుకుంటూ ముందుకు వెళితే ఏపీలో అప్పులు కుప్పలుగా పెరిగిపోతాయి.

ఈ తరుణంలో జగన్ సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.ఆదాయాన్ని పెంచేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు.

మరి ఎన్ని రకాలుగా ఆదాయం పెంచుకునే అవకాశం ఉన్న ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా, ఇప్పుడు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube