ప్రైవేట్ కాలేజీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ కాలేజీలకు దిమ్మతిరిగే షాక్ ఏపీ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది.ఈ విషయాన్ని స్వయంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు.

 The Ap Government Has Given A Shock To Private Colleges , Ap Government , Privat-TeluguStop.com

రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చింది అని పేర్కొన్నారు.ఫీజుల విషయంలో 70 శాతం మాత్రమే వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

అయినా కానీ కొన్ని ప్రైవేట్ కాలేజీ సంస్థలు అధిక ఫీజులు కట్టించుకుంటున్నారు.

ఈ విషయంలో ఇప్పటికే నాలుగు వందల జూనియర్ కాలేజీలకి నోటీసులు అందజేయడం జరిగిందని తెలిపారు.

కరోనా టైంలో ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను వేధించే స్థితిలో విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నాయి అంటూ మండిపడ్డారు.ఆన్లైన్ క్లాస్ లు అంటూ భారీగా ఫీజులు తల్లిదండ్రుల దగ్గర రాబడుతున్నారని ఈ విషయంలో ఇప్పటికే ఫిర్యాదులు అందాయి అని పేర్కొన్నరు.

ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసులకి రానివ్వకుండా చూడటం మరోపక్క హాల్టికెట్ ఇవకుండా విద్యాసంస్థలు మానసికంగా విద్యార్థులను అదేవిధంగా తల్లిదండ్రులను వేధించే రీతిలో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.ఈ విధంగా వ్యవహరించే కొన్ని విద్యా సంస్థలకు ఇప్పటికే నోటీసులు అందించడం జరిగిందని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube