మాస్క్ విషయములో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

దేశంలో ఊహించనివిధంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఇటీవల ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దేశంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు.

కాబట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో కేసులు అధికంగా పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ దిశగా ఆలోచనలు చేస్తూ కర్ఫ్యూలు విధిస్తున్నాయి.

Telugu Andhra Pradesh, Corona, Maharashtra, Modi, Telangana-Telugu Political New

  తెలుగు రాష్ట్రాలలో కూడా కేసులు పెరుగుతుండటంతో తాజాగా ఏపీ ప్రభుత్వం మాస్క్ విషయములో కీలక నిర్ణయం తీసుకుంది.  మాస్క్ ధరించకుండా గ్రామాల్లో పట్టుబడితే 500 రూపాయలు పట్టణాల్లో పట్టుబడితే 1000 రూపాయలు ఫైన్ విధించాలని చలానా పుస్తకాలు తాజాగా పోలీసులకు కూడా ఇవ్వటం జరిగింది అన్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న టాక్.మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతుండటంతో .అక్కడ లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో కెసిఆర్ సర్కార్ ఉంది.తెలంగాణ పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కొన్ని జిల్లాలలో ఇప్పటికీ లాక్‌డౌన్‌ అమలవుతోంది.పైగా కొత్త వైరస్ కేసులు బయటపడుతూ ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర సర్కార్ మరోసారి కరోనా నిబంధనలను చాలా కఠినంగా అమలు చేయటానికి పూనుకుంటుంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube