ఆలయాల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.ఇందులో భాగంగా ఒకే చోట ఏళ్ల తరబడి తిష్టవేసిన ఉద్యోగులపై చర్యలకు సిద్ధం అయింది.
ఈ క్రమంలోనే మూడు నెలలకు ఒకసారి ఆలయాల్లో ఉద్యోగుల డ్యూటీలను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది.ఒకే పోస్టులో ఏళ్ల తరబడి కొనసాగడం వలనే అవకతవకలకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సర్కార్ ఈ చర్యలకు సిద్ధం అయిందని తెలుస్తోంది.
దీంతో ఆలయాల్లో ఇకపై డ్యూటీలు రొటేషన్ పద్ధతిలో మూడు నెలలకు ఒకసారి మార్చాలని ఆదేశాలు జారీ చేసింది.