కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలం -యనమల

కరోనా వ్యాప్తి నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.కొవిడ్ వైరస్‎కు గేట్లు ఎత్తేశారు, కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేతులెత్తేసిందని యనమల ధ్వజమెత్తారు.

 Andra Pradesh, Ap Government, Tdp Leader Yanamala Ramakrishnudu, Fails To Contro-TeluguStop.com

బుధవారం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ.మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా అని ప్రశ్నించారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు ఇదేమి పబ్జి గేమ్ కాదని., రోజుకు 90 మంది ప్రాణాలు పోతుంటే సీఎం జగన్ కు నిద్ర ఎలా పడుతోందని విమర్శించారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానిక కూడా సీఎం జగన్ సిద్ధంగా లేరని మండిపడ్డారు.

కేంద్రం ఇచ్చిన రూ.8వేల కోట్లు ఏం చేశారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.క్వారంటైన్ కేంద్రాల్లో ఆహారానికి ఎంత ఖర్చు చేశారని ప్రభుత్వాన్ని అడిగారు.కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ చేసినప్పుడు ఇస్తానని చెప్పిన రూ.2 వేలు ఎంతమంది ఇచ్చారో చెప్పాలన్నారు.మాస్క్‎ల కొనుగోళ్లకు ఎంత ఖర్చు చేశారు.ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్షల లెక్కలు, వాటిపై ఎంత ఖర్చు చేశారు.కరోనా కిట్ల కొనుగోళకు ఎంత ఖర్చు చేశారు.? ఇలా కరోనా నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube